![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -155 లో... రుద్ర నిద్ర లేచేసరికి గంగ గదిలో ఉండదు. ఆ శేఖర్ ని కలవడానికి వెళ్లి ఉంటుంది. ఒకసారి శ్రీనుకి ఫోన్ చేద్దాం అనుకునే లోపు టేబుల్ పై లెటర్ కనిపిస్తుంది. అందులో గంగ.. నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించే దారి కనిపించడం లేదు సర్.. అందుకే నేను ఉండను.. మీ కులదైవం దగ్గరికి వెళ్లిపోతున్నానని రాస్తుంది. అది చూసి రుద్ర ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాడు. అసలు నా కుటుంబానికి ఎవరి దిష్టి తగిలిందని పెద్దసారు బాధపడతాడు. గంగ కోసం రుద్ర తన కుల దైవం గుడికి బయల్దేరతాడు.
మరొకవైపు జరిగింది అంతా పారుకి చెప్తారు. గంగ ఇంట్లో నుండి వెళ్ళిపోయిందని ఇషిక చెప్పగానే పారు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వీరుకి శేఖర్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. నువ్వు గంగకి వ్యతిరేకంగా చెప్పడంతో తను ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.. ఇక తను ఈ లోకంలో ఉండదు. నువ్వు కూడా ఇక నాకు కాల్ చెయ్యకు.. నీతో అవసరం అయిపోయిందని వీరు అనగానే శేఖర్ షాక్ అవుతాడు. గంగకి ఏమైందని టెన్షన్ పడుతాడు.
మరొకవైపు గంగ ఏడుస్తూ గుడిలో కత్తితో తొందరగా పొడుచుకుంటుంది. అప్పుడే శేఖర్ అక్కడికి వస్తాడు. రుద్ర కూడ వస్తాడు. మరొకవైపు పారు శకుంతల దగ్గరికి వెళ్తుంది. అయ్యో పాపం గంగ ఎంత పనికి చేసింది. వాళ్ళ అమ్మనాన్నకి చెప్పారా.. ఒకవేళ గంగ చనిపోతే వాళ్ళ నాన్న అసలే మూర్ఖుడు.. మీరే కావాలని చేశారని అంటాడు. అందుకే చెప్పండి అని పారు అనగానే పెద్దసారు కోప్పడతాడు. గంగతోనే రుద్ర ఇంటికి వస్తాడని పెద్దసారు చెప్తాడు.
మరొకవైపు ఎంత పని చేసావ్ గంగ.. నేను అబద్ధం చెప్పాను.. నా వల్లే ఇదంతా అని శేఖర్ ఏడుస్తుంటే రుద్ర వింటాడు. అప్పుడే గంగ లేస్తుంది.. ఇదంతా నాటకం అన్నా.. నీ నుండి నిజం చెప్పించండానికి అని గంగ అనగానే శేఖర్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |